నక్షత్రములు- ఫలితములు (108 పాదములు)

 నక్షత్రములు- ఫలితములు

(108 పాదములు)

సౌరమండలంలో సూర్యుని చుట్టూ సంచరించే గ్రహాలు, తదితర ఖగోళ పదార్ధాలన్నీ సంచరించే విధాననాన్నే 'రవిమార్గం' అని అంటాము. దీనినే జ్యోతిషపరిభాషలో 'భచక్రం' అని పిలుసుకుంటాము. ఈ రాశి చక్రాన్ని 360 డిగ్రీలుగా విభజన చేసుకుని ఈ రవి మార్గాన్ని 27 విభాగాలుగా గుర్తించారు మన పూర్వీకులు, అవే మనకున్న 27 నక్షత్రాలు. రవి మార్గంలో ప్రతిరోజూ చంద్రుడు ఏ నక్షత్రానికి సమీపంలో ఉంటాడో గమనించి ఆ నక్షత్రాన్ని ఆ రోజు నక్షత్రంగా గుర్తించారు. అవే అశ్విని మొదలుకుని రేవతి వరకు ఒక్కో నక్షత్ర ప్రమాణం 13 డిగ్రీల 20 నిమిషాలు. లోక్సభ ఎన్నికలు 2024 నియోజకవర్గాలు | అభ్యర్థులు | ఎన్నికల తేదీలు ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలుగా విభజించండం వలన మొత్తం 27 నక్షత్రాలకు 27 x 4 =108పాదలుగా ఏర్పడినాయి. ఒక్కో నక్షత్ర పాద ప్రమాణం 3 డిగ్రీల 20 నిమిషాలు. నక్షత్రాలను గమనించిన తర్వాత ఆకాశాన్ని 12 విభాగాలుగా చేయడం జరిగినది, అవే మేషాదిగా ద్వాదశ రాశులు. ఒక్కో రాశి ప్రమాణం 30 డిగ్రీలు. మొత్తం 12 రాశుల ప్రమాణం 360 డిగ్రీలు. నక్షత్రపాద విభజన వేరు వేరు రాశులలో వేరు వేరు నక్షత్రాలను చేర్చడానికి అవసరమైంది. ఒక్కో రాశిలో వేరు వేరు నక్షత్రాలకు సంబంధించిన 9 పాదాలుగా పొందుపరిచారు. 27 నక్షత్రాలలోను ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి. మొత్తం నూట ఎనిమిది పాదాలే గాక వాటికి విడివిడిగా రాశ్యంశలు కూడా ఉంటాయి.


• అశ్వని, రోహిణి, పునర్వసు, మఖ, హస్త, విశాఖ, మూల, శ్రవణం, పూర్వాభాద్ర అనబడే తొమ్మిది నక్షత్రాల ప్రధమ పాదాలు మేషాంశకు, ద్వితీయ పాదాలు వృషభాంశకు, తృతీయ పాదాలు మిధునాంశకు, చతుర్ధ పాదాలు కర్కటాంశకు చెంది ఉంటాయి. • భరణి, మృగశిర, పుష్యమి, పుబ్బ, చిత్ర, అనూరాధ, పూర్వాషాడ, ధనిష్ఠ, ఉత్తరాభాద్ర అనబడే తొమ్మిది నక్షత్రాల ప్రధమ పాదాలు సింహాంశకు, ద్వితీయ పాదాలు కన్యాంశకు, తృతీయ పాదాలు తులాంశకు, చతుర్ధ పాదాలు వృశ్చికాంశకు చెంది ఉంటాయి. • కృత్తిక, ఆరుద్ర, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, జ్యేష్ఠ, ఉత్తరాషాడ, శతభిషం, రేవతి అనబడే తొమ్మిది నక్షత్రాల ప్రధమ పాదాలు ధనురాంశకు, ద్వితీయ పాదాలు మకరాంశకు, తృతీయ పాదాలు కుంభాంశకు, చతుర్ధ పాదాలు మీనాంశకు చెంది ఉంటాయి.



* 1) అశ్వని నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు 

1) తస్కరాంశ:- అశ్వని నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. మంచి సంపద, భోగాలను అనుభవించువాడు, తగాదాలనిన ఇష్టం కలవాడు, లోభ గుణం కలవాడు, పరస్త్రీల యందు ఆసక్తి కలవాడు, చోర గుణం కలవాడు అగును. 

2) భోగ్యాంశ:- అశ్వని నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. ధర్మ నిరతుడు, తేజస్సు కలవాడు, ధన, ధాన్యాభివృద్ధి కలవాడు, దాన గుణం కలవాడు అగును. 

3) విచక్షణాంశ:- అశ్వని నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. సమస్త భోగాలు కలవారు, ప్రతి పనిని సాధించువాడు, పనులను నేర్పుతో చేయువాడు అగును. 

4) ధర్మాంశ:-అశ్వని నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది. భగవంతుడి పైన భక్తి కలవాడు, పూజలు చేయువాడు, సంధ్యావందన తత్పురుడును, నిత్యం ధర్మ కార్యాచరణలో ఉండువారు అగును. 


* 2) భరణి నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు 

5)నృపాంశ:- భరణి నక్షత్ర ప్రధమ పాదం రవిది. గౌరవ, మర్యాదలు పొందువారు, మంచి లక్షణాలు కలిగి ఉంటారు. కార్య సఫలత కలవారు, ధర్మాత్ముడు అగును. 

6) నపుంసకాంశ:- భరణి నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది. లోభత్వం కలవారు, నపుంసకుడు, పిసినారి, పనులయందు నేర్పరి, మధ్యవర్తిత్వం చేయువారు అగును.

 7) అభయాంశ:-భరణి నక్షత్ర తృతీయ పాదం శుక్రుడిది. ప్రశాంతమైన మనస్సు కలవారు, ఉత్సాహవంతులు, శూరులు, బాద్యతారాహిత్యమైన జీవితాన్ని ఆశించేవారు అగును. 

8) పాపాంశ:- భరణి నక్షత్ర చతుర్ధ పాదం కుజుడిది. క్రూర స్వభావం కలవారు, కృతజ్ఞత కలవారు, అధిక పుత్ర సంతానవంతులు, ఫలితాలను ఆశించని వారు అగును.


* 3) కృత్తిక నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు 

9) ధానాంశ:- కృత్తిక నక్షత్ర ప్రధమ పాదం గురువుది. దాన, ధర్మాలు చేయువారు, ధనవంతులు, ప్రతాపవంతులు, పనులలో నైపుణ్యం కలవారు అగును. 1

0) పాపాంశ:- కృత్తిక నక్షత్ర ద్వితీయ పాదం శనిది. మొహమాటం లేకుండా ఉంటారు, పాప కర్మలు చేయువారు, వేశ్యా గృహాలలో జీవించే వాళ్ళుగా ఉంటారు. 

11) ఉగ్రాంశ:- కృత్తిక నక్షత్ర తృతీయ పాదం శనిది. చెడు సావాసాలు చేయువారు, నైపుణ్యం ఉన్నప్పటికి మంద బుద్ధులుగా ఉంటారు, దుష్ఠులైన మిత్రులు కలవారు అగును. 

12) ఉత్కృష్టాంశ:- కృత్తిక నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. విద్యా వినయాలు కలవారు, ధర్మాత్ములు, ధార్మికులు, ఎల్లప్పుడు సంతోషం కలవారు అగును.


* 4) రోహిణి నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు 

13) సేనాంశ:- రోహిణి నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. చంచలత్వం కలవాడు, ఎర్రని వెంట్రుకలు కలవాడు, శూరుడు, దెబ్బలాటలకు ప్రీతి కలవాడు, నిష్టూరంగా మాట్లాడు వాడు అగును. 

14) భృత్యాంశ:-రోహిణి నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. పొడవైన శరీరం కలవాడు, ఓటమిని అంగీకరించలేని తనం కలవారు, మంచి నడవడిక కలవారు అగును. 

15) విద్యాంశ:- రోహిణి నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. పండితులు గాను, కవులు గాను, గణిత శాస్త్రజ్ఞులు గాను, లోక వ్యవహార జ్ఞానం కలవారు గాను ఉంటారు. 

16) అత్యాశ:- రోహిణి నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది. ఇతరుల ధనంపైన ఆశపడేవారు, తెలివైన వారుగాను, బుద్ధిమంతులుగాను, సజ్జనులుగాను ఉందురు. 


* 5) మృగశిర నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు 

17) రాజాంశ :- మృగశిర నక్షత్ర ప్రధమ పాదం రవిది. స్దూలమైన శరీరం కలవారు, శత్రువులపైనా విజయం సాదించువారు, ధనవంతులు, తలకు మించిన పనులను నెత్తిన వేసుకొనేవారు గాను ఉంటారు. 

18)చండాంశ:- మృగశిర నక్షత్రం ద్వితీయ పాదం బుధుడిది. యజ్ఞ యాగాదులు చేయువారు, భాగ్యవంతులు గాను, మంచి వాక్ శుద్ధి కలవారు గాను ఉంటారు. 

19) అభయాంశ:- మృగశిర నక్షత్రం తృతీయ పాదం శుక్రుడిది. ఉదార స్వభావం కలవారు గాను, దేనికైనా సిద్ధపడేవారు గాను, ముఖ వర్చస్సు కలవారుగాను, మంచి పనులు చేయువారు, శౌర్యవంతులు గాను ఉందురు. 

20) నీచాంశ:-మృగశిర నక్షత్రం చతుర్ధ పాదం కుజుడిది. కామత్వం కలవారు, తలపైన దెబ్బ తగిలినవారు గాను, ఇతరులను ద్వేషించువారు గాను ఉందురు. 


* 6) ఆరుద్ర నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు

 21) కృపాంశ:- ఆరుద్ర నక్షత్ర ప్రధమ పాదం గురువుది. గుణవంతుడు, పెద్దల యందు భక్తి, ప్రశాంతమైన ముఖం కలవారు గాను, దయా స్వభావం కలవారుగాను, మంచి నేర్పరులుగాను ఉందురు. 

22) తస్కరాంశ:- ఆరుద్ర నక్షత్ర ద్వితీయ పాదం శనిది. కలహా ప్రియులు, చోర విధ్య బాగా తెలిసినవారు, అతి దాహార్తి కలవారు, హీనమైన కాంత స్వరం కలవారు గాను ఉంటారు. 

23) ఉగ్రాంశ:- ఆరుద్ర నక్షత్ర తృతీయ పాదం శనిది. శుచి శుభ్రత లేనివారు, చెడు ఆలోచనలు చేసేవారు, స్ధిరమైన ఆదాయం లేనివారు, మంత్ర తంత్రాలతో భయపెట్టేవారు అగును. 

24) ఉత్కృష్టాంశ:- ఆరుద్ర నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. ధర్మాన్ని పాటించేవారు, అక్కటి ఆచార వ్యవహారాలు చేయువారు, గౌరవ మర్యాదలు తెలిసిన వారై ఉంటారు.


* 7) పునర్వసు నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు 

25) ఉత్తమాంశ:- పునర్వసు నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. భగవంతునిపైన భక్తి కలవారు, ఎర్రటి కనులు కలవారు, కోప స్వభావం, చెడు ప్రవర్తన కలవారుగాను ఉంటారు. 

26) భోక్తాంశ:- పునర్వసు నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. వస్త్ర అలంకార ప్రియులు, భోజన ప్రియులు, ధనవంతులు, శృంగార ప్రియులు అవుతారు. 

27) సౌమ్యాంశ:- పునర్వసు నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. పండితుడు, లోభ స్వభావం కలవారు, తరచూ వ్యాధి పీడితులుగాను, వ్యాపార దక్షత కలవారు, శృంగార ప్రియులు అవుతారు. 

28) ధనాంశ :- పునర్వసు నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది. ఆదిక ధనవంతులు, ఉపకారం చేయువారు, స్త్రీల మాటలను పాటించువారు, నిర్మలత్వం కలవారు, ఆకర్షణ కలవారు అవుతారు. 


* 8) పుష్యమి నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు 

29) భూపాంశ:- పుష్యమి నక్షత్రం మొదటి పాదం రవిది. వీరికి ఏకాంతమన్న ప్రీతి, ప్రతి పని తొందరగా చేస్తారు. రోగం కలవారుగాను, స్ధూల కాయం కలగి ఉంటారు. 

30) సౌమ్యాంశ:- పుష్యమి నక్షత్రం రెండవ పాదం బుధుడిది. పరస్త్రీలపైనా వ్యామోహం కలిగి ఉంటారు. వారి మూలంగా కష్టాలను తెచ్చుకుంటారు. ధనకాంక్ష కలిగి ఉంటారు. 

31) శూరాంశ :- పుష్యమి నక్షత్రం మూడవ పాదం శుక్రుడిది. చాలా ప్రసన్నంగా ఉంటారు. భోగవంతులు, పరోపకారి, నిత్యం మనశ్శాంతి కలిగి ఉంటారు. 

32) నీచాంశ:- పుష్యమి నక్షత్రం నాల్గవ పాదం కుజుడిది. వీరు సహజంగా కలహ ప్రియులు, ఇతరుల వస్తువులను దొంగలించువారు. పరస్త్రీల యందు ఆసక్తి కలవారుగాను ఉంటారు. 


* 9) ఆశ్లేష నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు 

33) ఉత్పన్నాంశ:- ఆశ్లేష నక్షత్ర ప్రధమ పాదం గురువుది. వీరు ధైర్యవంతులు. సత్యవాక్కులు పలుకువారు. మంచిబుద్ధి కలవారుగాను ఉంటారు. 

34) పాపాంశ:- ఆశ్లేష నక్షత్ర ద్వితీయ పాదం శనిది. వీరు నిత్యం ఏదో ఒక వ్యాధితో బాధపడుతూనే ఉంటారు. పాప కార్యాలు చేయుటలో ఆసక్తి కలిగి ఉంటారు. చంచల స్వభావం కలిగి ఉంటారు. చెడ్డ పనుల ద్వారా ఆదాయం సంపాదిస్తారు. సుకి శుభ్రత లేనివారు అవుతారు. 

35) క్రోధాంశ:- ఆశ్లేష నక్షత్ర తృతీయ పాదం శనిది. వీరు అబద్ధాలు ఆడటం, కుట్రలు చేయటం, అన్యాయంగా డబ్బు సంపాదించటం, బుద్ధి మాంద్యం, వాటా రోగం కలిగి ఉంటారు. 

36) ఉగ్రాంశ:- ఆశ్లేష నక్షత్ర నాల్గవ పాదం గురువుది. వీరు మాట పితరులకు మారకులు అవుతారు. దాన నాశకులు, పరుల పెంపకంలో ఉండేవారు, ఒక మోస్తరుగా సుఖపడేవాళ్ళుగా ఉంటారు. 


* 10) మఖ నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు 

37) సేవాంశ:- మఖ నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. వీరి శరీరంపై ఎర్రని రోమాలు కలిగి ఉంటారు. పట్టుదల కలిగి ఉంటారు. ప్రతిష్ఠ కలవారుగా ఉంటారు. 

38) భుక్తాంశ:- మఖ నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది వీరు ఏకాంతాన్ని కోరుకుంటారు. త్యాగం చేయువారు, దేనినైనా న్యాయంగా పొందాలి. సంపాదించాలి అని కోరుకునేవారు. 

39) విచక్షణాంశ:- మఖ నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. వీరు జ్ఞాన వంతులు, మేధావులు, శాస్త్రవేత్తలు, నేర్పరులుగా ఉంటారు. 

40) అంత్యాంశ :- మఖ నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది. వీరు స్త్రీ ప్రియులు, రోగం కలవారు, తెలివైనవాళ్ళు, కుటిలమైన స్వభావం కలిగి ఉంటారు. పొట్టిగా ఉంటారు. 


* 11) పుబ్బ నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు 

41) రాజాంశ:- పుబ్బ నక్షత్ర ప్రధమ పాదం రవిది. వీరు చంచలమైన నేత్రాలు కలిగి ఉంటారు. చూడటానికి బలహీనంగా ఉంటారు. కొనుగోలు, అమ్మకాలు వ్యవహారాలు కలిగిన వ్యాపారాలలో నిపుణత్వం కలిగి ఉంటారు. 

42) నపుంసకాంశ :- పుబ్బ నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది. కీర్తి ప్రతిష్ఠలు కలిగి ఉంటారు. వికృత రూపం కలిగి ఉంటారు. ఇతరులకు కష్ఠం కలిగిస్తూ ఉంటారు. 

43) అభయాంశ :- పుబ్బ నక్షత్రం తృతీయ పాదం శుక్రుడిది. వీరికి పుత్ర సంతానం అధికంగా కలిగి ఉంటారు. శిల్పశాస్త్రంలో నిపుణులు అవుతారు. గణిత శాస్త్రంలోను నిపుణత్వం కలిగి ఉంటారు. 

44) దరిద్రాంశ :- పుబ్బ నక్షత్రం చతుర్ధ పాదం కుజుడిది. జీవితంలో సుఖం ఉండదు. నిత్యం కష్ఠలను అనుభవిస్తారు. అధిక సంతానం కలిగి ఉంటారు. దరిద్రాన్ని అనుబావిస్తూంటారు. 


* 12) ఉత్తర నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు 

45) ఉత్పన్నాంశ:- ఉత్తర నక్షత్రం ప్రధమ పాదం గురువుది. వీరు వాత రోగం కలిగి ఉంటారు. పరిశుద్ధులు, ప్రబంధ ప్రియులు, కావ్యాస్వాదనా చతురులు కలవారు అవుతారు. 

46) పాపాంశ :- ఉత్తర నక్షత్రం ద్వితీయ పాదం శనిది. వీరు పరులను పీడించేవారుగాను, చంచలత్వం కలవారుగాను, నిత్య దరిద్రులుగా ఉందురు. 

47) ఉగ్రాంశ:- ఉత్తర నక్షత్రం తృతీయ పాదం శనిది. వీరు మేలు చేసిన వారిని మరిచిపోతారు. చెడు వాదనలు చేసేవాళ్ళు, డాంబికాలు పోతారు, గర్విష్టులు, అందరిని సూటిపోటీ మాటలతో వేదిస్తారు. 

48) శుభాంశ :- ఉత్తర నక్షత్రం చతుర్ధ పాదం గురువుది. వీరు వినయ విధేయతలు కలవారు, విద్యా సంపన్నులు అవుతారు. పుత్ర సంతానం కలవారు అవుతారు. 


* 13) హస్త నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు. 

49) క్రూరాంశ:- హస్తా నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. వీరు పాప కర్మలు చేసేవాళ్ళు, బలవంతులు, చింతన కలవారు అవుతారు. 

50) ముక్తాంశ:- హస్తా నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. వీరు నిత్యం మంచి మాటలనే మాట్లాడేవారు, మంధ బుద్ధి కలవారుగాను ఉంటారు. 

51) పండితాంశ:- హస్తా నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. వీరు చెడ్డ బుద్ధి కలవారు, కాముకులు, వ్యాపారంలో భాగం అయిన అమ్మకాలు, కొనుగోళ్ళు విషయాలలో మహా నిపుణులుగా ఉంటారు. 

52) ధనాంశ:- హస్తా నక్షత్రం చతుర్ధ పాదం చంద్రుడిది. వీరు రాచకార్యాలు చేయుటలో ఇష్టం కలవారు, సన్మానాలు పొందేవారు, అభిమానవంతులు, కొద్దిగా కోపం కలవారుగాను ఉంటారు.


* 14) చిత్రా నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు 

53) రాజాంశ:- చిత్రా నక్షత్ర ప్రధమ పాదం రవిది. వీరు చంచల మనస్తత్వం కలవారుగా ఉంటారు. ఉగ్ర స్వభావం కలవారుగా ఉంటారు. 5

4) నపుంసకాంశ:- చిత్రా నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది. వీరు చాలా తియ్యగా మాట్లాడి జనాలను నమ్మిస్తారు. కోపం వస్తే చాలా కాలం ఉంటుంది. ఈ పనిని ఐనా సరే అధికకాలం అయ్యేటట్లు చేస్తారు. 

55) అభయాంశ:- చిత్రా నక్షత్ర తృతీయ పాదం శుక్రుడిది. వీరు కీర్తిమంతులు, శౌర్యవంతులు, పండితులతో సహవాసం చేయటం, వారితోనే గడపటం వీరి లక్షణాలు. 

56) ధనాంశ:- చిత్రా నక్షత్ర చతుర్ధ పాదం కుజుడిది. వీరు చిన్నతనంలోనే దొంగతనాలకు పాల్పడతారు. సరిపడా సంపాదించాక నేరాలు మానేస్తారు. అమిత ధైర్యవంతులు, విక్రమం కలవారుగాను ఉంటారు. 


* 15) స్వాతి నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు 

57) ఉత్పన్నాంశ :- స్వాతి నక్షత్ర ప్రధమ పాదం గురుడుది. వీరు ఎప్పుడు అతిగా మాట్లాడుతూనే ఉంటారు. సూక్ష్మ పరిశీలన కలవారు. జ్ఞానం కలవారుగాను ఉంటారు. 

58) ధనాంశ :- స్వాతి నక్షత్ర ద్వితీయ పాదం శనిది. వీరు చెడ్డపేరు తెచ్చుకుంటారు. దొంగలుగా, వ్యసనపరులుగా పరిణమిస్తారు. సాయం చేసినవారిని మాత్రం మరువరు. 

59) ఉగ్రాంస:- స్వాతి నక్షత్ర తృతీయ పాదం శనిది. వీరు మూర్ఖులు, అత్యంత కోపం కలవారు. శత్రువుల పట్ల ద్వేషం పెంచుకునే వారు. అతిగా ఖర్చు పెట్టేవాళ్ళుగా ఉంటారు. 

60) ఉత్కృష్టాంశ :- స్వాతి నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. వీరు కోపం కలిగి ఉన్న జనాభిమానం కలవారు. గురుభక్తి కలవారు. ధనికులు అయి ఉంటారు. 


* 16) విశాఖ నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు 

61) సౌఖ్యాంశ:- విశాఖ నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. పలుచటి ఛాతీ కలిగిన శరీరం. ఎర్రటి కన్నులు కలిగి ఉంటారు. మిక్కిలి ధనవంతులై ఉంటారు. 

62) భోగాంశ:- విశాఖ నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. రూప వంతులు, సౌందర్యవంతులు, అందమైన భార్య కాళీ ఉంటారు. సౌఖ్యవంతులు. చెవిటి వాళ్ళుగా గాని, వినికిడి లోపం ఉన్నవారుగా గాని ఉంటారు. దేనినైనా న్యాయ పరంగా సంపాదింకునేవాళ్ళు అవుతారు. 

63) సౌమ్యాంశ:- విశాఖ నక్షత్రం తృతీయ పాదం బుధుడిది. ఈ జాతకులు మంచి చెడు పట్ల విచక్షణ కలిగి ఉంటారు. నేర్పరితనం కలిగి ఉంటారు. దాన గుణవంతులుగా ఉంటారు. కంటి చూపును కోల్పోవటం లేదా లోపం గాని ఏర్పడవచ్చును. 

64) అర్ధాంశ:- విశాఖ నక్షత్రం చతుర్ధ పాదం చంద్రుడిది. స్త్రీలను ఆకర్షించువాడు. దృష్టి లోపం కలవాడు. ధన సంపాదన పైన ఆసక్తి కలవాడు అగును. 


* 17) అనూరాధ నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు 

65) రాజాంశ :- అనూరాధ నక్షత్ర ప్రధమ పాదం రవిది. ఈ జాతకులు మాట్లాడేటప్పుడు వినయ విధేయతలు కలిగి ఉంటారు. నీతి నియమాలు కలిగి ఉంటారు. మంత్రోపాసన చేసేవారు. మంత్రాంగాలు నెరపేవాళ్ళుగా ఉంటారు. 

66) నపుంసకాంశ:- అనూరాధ నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది. ఈ జాతకులు వీణా వాయిద్యాల పట్ల మక్కువ కలిగి ఉంటారు. ఆదర్శమూర్తులు. మేధావులుగా ఉంటారు. 

67) అభయాంశ :- అనూరాధ నక్షత్ర తృతీయ పాదం శుక్రుడిది. వీరికి స్ధిరత్వం ఉండదు. అనుకూలవతియైన భార్య లభిస్తుంది. 

68) నీచాంశ:- అనూరాధ నక్షత్రం చతుర్ధ పాదం కుజుడిది. ఈ జాతకులు ఇతరులకు ద్రోహం చేసేవాళ్ళు, కుట్రలు కుతంత్రాలు చేసేవాళ్ళు, దరిధ్రులు అవుతారు. 


* 18) జ్యేష్ఠ నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు 

69) ఉత్పన్నాంశ :- జ్యేష్ఠ నక్షత్ర ప్రధమ పాదం గురువుది. రచనా సామర్ధ్యం కలవారు. హాస్యప్రియులు, గర్వం కలవారుగా ఉంటారు. 

70) ఉగ్రాంశ:- జ్యేష్ఠ నక్షత్ర ద్వితీయ పాదం శనిది. ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడేవారుగాను, ఇతరులకు సులభంగా లొంగిపోయేవారుగాను ఉంటారు. 

71) పాపాంశ:- జ్యేష్ఠ నక్షత్ర తృతీయ పాదం శనిది. ఈ జాతకులు అంగవైకల్యం కలిగి ఉంటారు. మరీ అతి స్వల్పమైన భోగం కలిగి ఉంటారు. చూపు సరిగా లేకపోవటం, ఇతరుల పనులు చేయువారు అగుదురు. 

72) శుభాంశ:- జ్యేష్ఠ నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. వినికిడి లోపం కలిగి ఉంటారు.ధర్మ శాస్త్రాలపైనా పట్టు కలవారు. పూజలు చేయువారు. శాస్త్రవేత్తలు అవుతారు. 


* 19) మూల నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు 

73) తస్కరాంశ:- మూల నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. తండ్రి సహాకారం లేనివాడు. వ్యాధిగ్రస్తులుగా ఉంటారు. ధరిద్రులు అవుతారు. 

74) భోక్తాంశ:- మూల నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. మాతృసౌఖ్యం లేనివారు, దయామయులు, క్షీరాన్నం, బెల్లం పట్ల మక్కువ కలవారు. వాహన సౌఖ్యం కలవారు. భోగాలను అనుభవించేవారు. 

75) విచక్షణాంశ:- మూల నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. ఈ జాతకులు ధనవంతులు, ఖర్చు పెట్టే మనస్తత్వం కలవారు. మంచి సంభాషణాపరులు, విద్యావంతులు, జ్యోతిష్య విద్య తెలిసిన వాళ్ళు, ఎదుటి వారు ఏది చెబితే వినగలరో అది చెప్పగలిగే సామర్ధ్యం ఉన్నవారు. 

76) ధనాంశ:- మూల నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది. ఈ జాతకులు ప్రభుత్వ ఉద్యోగులు, సేనాపతులు, పరోపకారులు, కామత్వం కలవారు, రోగ సూచనలు కలవారు, ఆడవారి కంఠ స్వరం కలవారు. మెత్తగా మాట్లాడేవారు, లౌకికం కలవారు అవుతారు. 


* 20) పూర్వాషాఢ నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు 

77) ఉత్పన్నాంశ:- పూర్వాషాఢ నక్షత్ర ప్రధమ పాదం రవిది. సౌఖ్యత లేనివారు, ఎర్రటి నేత్రాలు కలవారు, శక్తి సామర్ధ్యాలు కలవారు 

78) అభయాంశ:- పూర్వాషాఢ నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది. ఈ జాతకులు పెద్ద పొట్ట కలిగి ఉంటారు. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. మృదువుగానే మాట్లాడుతారు. అవతలి వ్యక్తులలోని సద్గుణాలను పసిగడతారు. 

79) భాగ్యాంశ :- పూర్వాషాడ నక్షత్ర తృతీయ పాదం శుక్రుడిది. ఈ జాతకులు నిత్యం శుచిగా ఉంటారు. దయా హృదయం కలిగి ఉంటారు. భాగ్యవంతులు, చపలచిత్తం కలవారుగా ఉంటారు. 

80) ఉగ్రాంశ:- పూర్వాషాడ నక్షత్ర చతుర్ధ పాదం కుజుడిది. పండితుల పట్ల ద్వేషం కలవారు. ఉగ్ర స్వభావం కలవారు. పాపకార్యాలు చేయువారు, అబద్ధాలాడటం వీళ్ళ స్వభావంగా ఉంటుంది. 


* 21) ఉత్తరాషాఢ నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు 

81) ఉత్పన్నాంశ:- ఉత్తరాషాఢ నక్షత్ర ప్రధమ పాదం గురువుది. ఈ జాతకులు బుద్ధిమంతులు. శాస్త్రవేత్తలు, స్ధిరాస్తులు కలవారు, పెద్దలయందు భక్తి కలవారు, ధర్మపాలన చేయువారు. 

82) పాపాంశ:- ఉత్తరాషాఢ నక్షత్ర ద్వితీయ పాదం శనిది. ఈ జాతకులు పనికి రాని పనులు చేయటంలో సిద్ధహస్తులు. ఇతర మతాలపట్ల ప్రేమాభిమానాలు కలవారు. 

83) ఉగ్రాంశ:- ఉత్తరాషాఢ నక్షత్ర తృతీయ పాదం శనిది. స్ధూలమైన శరీరం కలవారు. అల్ప సంతోషులు, నిత్యం వ్యాధిగ్రస్తులుగా ఉంటారు. 

84) శోభనాంశ:- ఉత్తరాషాఢ నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. శుభములు కలవారు, నిత్యం ఏదో ఒక పని చేసేవారు, శాస్త్ర విషయాలపై శ్రద్ధ కలవారు, వ్యాపార లక్షణాలు కలవారు, ఉత్సాహవంతులుగా ఉంటారు. 


* 22) శ్రవణానక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు 

85) మంగళాంశ:- శ్రావణా నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. కలహ ప్రియులు, పుత్ర సంతానం లేనివారు, గుల్మరోగం కలవారు అవుతారు. 

86) భోక్తాంశ:- శ్రావణా నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. సేవకులతో పని చేయించుకునేవారు. తంత్ర విద్యలపైనా ఆసక్తి కలవారు. కామత్వం కలవారు అవుతారు. 

87) విచక్షణాంశ :- శ్రావణా నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. ఈ జాతకులు అత్యంత ఉదార స్వభావం కలవారు. చిత్రలేఖకులు, కలహప్రియులుగా ఉంటారు. 

88) ధనాంశ:- శ్రవణా నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది. ఈ జాతకులు పసు పోషకులు. యోగులు, ధార్మికులు అవుతారు. ముక్కు పొడవు కలిగి ఉంటారు. 


* 23) ధనిష్ఠ నక్షత్ర నాలుగు పాదాలకు అంశగుణాలు 89) రాజాంశ :- ధనిష్ఠ నక్షత్ర ప్రధమ పాదం రవిది. ఈ జాతకులు స్ధూలమైన శరీరం కలవారు. దానగుణం కలవారు. స్త్రీలపైన ప్రీతి కలవారు అగును. 90) సౌమ్యాంశ :- ధనిష్ఠ నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది. వినయ విధేయతలతో మాట్లాడేవారు. ఉన్నత విద్యలు చదివేవారు అవుతారు. 91) అభయాంశ :- ధనిష్ఠ నక్షత్ర తృతీయ పాదం శుక్రుడిది. గుణవంతులు అవుతారు. చిరాయుష్మంతులు అవుతారు. సత్య పలుకులు పలుకువారు అవుతారు. 92) క్రూరాంశ :- ధనిష్ఠ నక్షత్ర చతుర్ధ పాదం కుజుడిది. ఈ జాతకులు నిత్యం పాప కర్మలు చేయుటలో లీనమై ఉంటారు. క్రూరమైన స్వభావం కలవారు. స్దూలమైన శరీరం కలవారు అవుతారు. 


* 24) శతభిష నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు 

93) ఉత్పన్నాంశ :- శతభిష నక్షత్ర ప్రధమ పాదం గురువుది. ఈ జాతకులు గోవులను పూజించువారు. బ్రాహ్మణులపట్ల గౌరవం కలవారు. సత్యం మాట్లాడువారు. స్ధిరమైన బుద్ధి కలవారు, అభిమానవంతులు, స్నేహములను కలిగి ఉంటారు. 

94) పాపాంశ :- శతభిష నక్షత్ర ద్వితీయ పాదం శనిది. ఈ జాతకులు పిరికితనం కలిగి ఉంటారు. ఏ పని తొందరగా చేయరు. పాపభీతి కలవారు అగుదురు. 

95) భయాంశ:- శతభిష నక్షత్ర తృతీయ పాదం శనిది. ఈ జాతకులు పుత్ర సంతానం కలిగి ఉంటారు. పాండిత్యం కలవారు. మంధబుద్ధికలవారు. పాప కర్మలు చేయువారు. ఉగ్ర కర్మలు చేయువారు అగుదురు. 96) సౌమ్యాంశ:- శతభిష నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. ఈ జాతకులు స్నేహశీలురు, పండితులు, అభిమానవంతులు, యజ్ఞ కార్యాలు చేయువారు. 


* 25) పూర్వాభాద్ర నక్షత్ర నాలుగు పాదాలకు అంశగుణాలు. 

97) సేవాంశ:- పూర్వాభాద్ర నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. ఈ జాతకులు ఉద్యోగస్తులు, విష్ణు పూజ చేయువారు, భోగులుగా ఉంటారు. 

98) భోగాంశ :- పూర్వాభాద్ర నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. ఈ జాతకులు సాహస వంతులు, మంత్రోపాసన చేయువారు, ప్రభుత్వ వ్యతిరేకులుగా ఉంటారు. 

99) విచక్షణాంశ:- పూర్వాభాద్ర నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. ఈ జాతకులు పితృ ప్రియులు, సుఖవంతులుగా ఉంటారు. జ్ఞానవంతులు, భోగులుగా ఉంటారు. 

100) ధనాంశ :- పూర్వాభాద్ర నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది. ఈ జాతకులు స్త్రీలపైనా ఆసక్తి కలవారు, అందరి చేత కీర్తింపబడేవారు, ధనవంతులు, మాతృ సేవకులుగా ఉంటారు. 


* 26) ఉత్తరాభాద్ర నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు 

101) తీక్షణాంశ:- ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రధమ పాదం రవిది. ఈ జాతకులు పైత్యా శరీరం కలవారు, చపల చిత్తం కలవారు, కోపిష్ఠులు, ఎర్రని నేత్రాలు కలవారు, కృశించిన శరీరం కలవారుగా ఉంటారు. 

102) అభయాంశ :- ఉత్తరాభాద్ర నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది. ఇజాతకులు జ్యోతిష శాస్త్ర పండితులుగా గాని, పంచాంగ కర్తలుగా గాని ఉంటారు. జ్ఞాన వంతులు, సౌమ్యమైన గుణం కలవారు, అవతలి వాళ్ళలోని గుణాలను గ్రహించగలిగే సామర్ధ్యం కలవారు అవుతారు. 

103) అభయాంశ :- ఉత్తరాభాద్ర నక్షత్ర తృతీయ పాదం శుక్రుడిది. ఈ జాతకులు తెలివితేటలు కలవారు, శాస్త్రవేత్తలు, ధనవంతులు అవుతారు. 

104) దీనాంశ:- ఉత్తరాభాద్ర నక్షత్ర చతుర్ధ పాదం కుజుడిది. ఈ జాతకులు చెడు స్నేహాలు కలవారు, శత్రువులు కలవారు, ధనం సంపాదించువారు అవుతారు. 


* 27) రేవతి నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు 

105) ఉత్పన్నాంశ :- రేవతీ నక్షత్ర ప్రధమ పాదం గురువుది. ఈ జాతకులు శాస్త్రాలపైనా పట్టు గలవారు, నీటి నియమాలు కలవారు, తాత్వికులు అగుదురు. 

106) పాపాంశ:- రేవతి నక్షత్ర ద్వితీయ పాదం శనిది. పాప కర్మలు చేసేవారు, జూదం ఆడేవారు, కుటిలమైన బుద్ధి కలవారు అగుదురు. 

107) ఉగ్రాంశ:- రేవతి నక్షత్ర తృతీయ పాదం శనిది. మంధ బుద్ధి కలవారు, సౌందర్యవంతులు, కోప స్వభావం కలవారు అగుదురు. 

108) శోభనాంశ :- రేవతి నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. ఈ జాతకులు యజ్ఞ యాగాదులు చేయువారు, ధైవ కార్యాలు చేయువారు, పండితులు, వేదాంతులు, ధైర్యవంతులు అవుతారు.

మూలం : డా. ఎం. ఎన్. ఆచార్య - 

ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు 

- శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. 

తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151


Post a Comment

0 Comments